Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియపర్చాలి

  • ఎన్‌బీసీ సభ్యుడు తల్లోజు ఆచారి 


కడ్తాల్‌: తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం, చరిత్ర, త్యాగాలు, ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియపర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. మండల కేంద్రంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు మాధవులు, యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్‌ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్మా్‌సపల్లి రోడ్డులో ఏర్పాటుచేసిన బస్‌షెల్టర్‌ను ఆదివారం జడ్పీటీసీ జర్పుల దశరథ్‌నాయక్‌, జడ్పీవై్‌సచైర్మన్‌ బాలాజీసింగ్‌, మార్కెట్‌చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహరెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షుడు గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు కె.చందోజీలతో కలిసి ఎన్‌బీసీ సభ్యుడు తల్లోజు ఆచారి, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కాజైపాల్‌ యాదవ్‌లు ప్రారంభించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ కారులకు అభినందన సన్మానసభ నిర్వహించారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సుమారు 200ల మంది ఉద్యమకారులను సత్కరించి అభినందించారు. అనంతరం జరిగిన సభలో ఎన్‌బీసీ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యకారులు చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. అమరుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో పాలక ప్రభుత్వం ఉద్యమ కారులను తగినవిధంగా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు ప్రభుత్వం సముచితస్థానం కల్పించి గౌరవించాలన్నారు. మండల కేంద్రంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌, సుష్మస్వరాజ్‌, సూదిని జైపాల్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి , శ్రీకాంతాచారి విగ్రహాలతో ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేసేలా ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, స్థానిక సర్పంచ్‌ జీఎల్‌ఎన్‌రెడ్డిలు చొరవ తీసుకోవాలని కోరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ త్యాగాల పునాదుల మీద నిర్మితమైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ఆహర్నిశలు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గౌరవం కల్పిస్తుందన్నారు. అమర వీరుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కడ్తాల మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు త్వరలో నూతన భవనాలు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కండె హరిప్రసాద్‌, నాయకులు గూడూరు భాస్కర్‌రెడ్డి, పిప్పళ్ల వెంకటేశ్‌, యాట నర్సింహ, జక్కు అనంతరెడ్డి, శంకర్‌, లాయక్‌అలీ, జహంగీర్‌అలీ, జహంగీర్‌బాబా, హన్మనాయక్‌, గురిగ్ళళ్ల లక్ష్మయ్య, పాలాది ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌, తెలంగాణ ఉద్యమకారులను సన్మానిస్తున్న నిర్వాహకులు


Advertisement
Advertisement