బైకులో పెట్టిన డబ్బులు చోరీ

ABN , First Publish Date - 2021-02-17T01:42:45+05:30 IST

బైకులో ఉంచిన డబ్బులను చోరీ చేసిన సంఘటన జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో జరిగింది.

బైకులో పెట్టిన డబ్బులు చోరీ

మంచిర్యాల: బైకులో ఉంచిన డబ్బులను చోరీ చేసిన సంఘటన జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో జరిగింది. చిన్నబూద గ్రామానికి చెందిన రైతు వంశీకృష్ణ తన పత్తిని విక్రయించాడు. పత్తి అమ్మగా వచ్చిన రూ.1,50,000లను బ్యాంక్‌కు వెళ్లి డ్రా చేశాడు. ఆ డబ్బులను బైక్‌లో పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యలో పట్టణంలోని బజారు ఏరియాలో ఉన్న బెంగుళూరు బేకరీ వద్ద ఆగాడు. అక్కడ బైక్‌ను ఆపి కూల్ డ్రింక్ తాగుతున్నాడు. ఈ క్రమంలో బైక్‌లో పెట్టిన రూ.1,50,000లను రైతుకు తెలియకుండా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడైన రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-02-17T01:42:45+05:30 IST