ఫార్మా షేర్లు పడేశాయ్‌..

ABN , First Publish Date - 2021-07-28T06:57:23+05:30 IST

ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూశాయి.

ఫార్మా షేర్లు పడేశాయ్‌..

  • సెన్సెక్స్‌ 274 పాయింట్లు డౌన్‌ 
  • నిఫ్టీ ఫార్మా సూచీ 4.33% పతనం 

ముంబై: ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. మంగళవారం బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 273.51 పాయింట్ల క్షీణతతో 52,578.76 వద్దకు పడిపోయింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 78 పాయింట్లు పతనమై 15,746.45 వద్దకు జారుకుంది. డాక్టర్‌ రెడ్డీస్‌ రెండంకెల క్షీణతతో నిఫ్టీ టాప్‌ లూజర్‌గా నిలిచింది. రెడ్డీ్‌సతోపాటు ప్రధాన ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగడంతో నిఫ్టీ ఫార్మా సూచీ 4.33 శాతం క్షీణించింది. ఈ సూచీలోని అరబిందో ఫార్మా 4.68 శాతం, లుపిన్‌ 4.31 శాతం, సిప్లా 3.51 శాతం నష్టపోయాయి. దివీస్‌ ల్యాబ్స్‌, సన్‌ఫార్మా, బయోకాన్‌, టొరెంట్‌ ఫార్మా షేర్లు 2 శాతానికి పైగా విలువను కోల్పోయాయి. కాగా, నిఫ్టీ-50లో హిందాల్కో 4.32 శాతం, ఎస్‌బీఐ లైఫ్‌ 3.19 శాతం, టాటా స్టీల్‌ 2.74 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2 శాతం, ఎస్‌బీఐ 1.39 శాతం లాభంతో టాప్‌-5 గెయినర్స్‌గా నిలిచాయి. 

Updated Date - 2021-07-28T06:57:23+05:30 IST