అధికారులు కూల్చారు

ABN , First Publish Date - 2020-05-25T09:37:20+05:30 IST

‘పువ్వాడ ఉదయ్‌కుమార్‌నగర్‌లో పలువురు ఇళ్ల స్థలాలను ఆక్రమించి గుడిసెలు వేసుకున్నారు.

అధికారులు కూల్చారు

మమ్మల్ని తప్పుపడుతున్నారు.

ప్లాట్లు అమ్ముకున్నారనడం అవాస్తవం

సర్పంచ్‌ కాంపాటి లలిత


రఘునాథపాలెం మే 24: ‘పువ్వాడ ఉదయ్‌కుమార్‌నగర్‌లో పలువురు ఇళ్ల స్థలాలను ఆక్రమించి గుడిసెలు వేసుకున్నారు. ఈవిషయాన్ని తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లగా వారు గుడిసెలను కూల్చారు. దీంతో పలువురు మాపై అసత్యప్రచారం చేస్తు అభాసుపాలు చేస్తున్నారని’ సర్పంచ్‌ కాంపాటి లలి త అన్నారు. ఆదివారం పువ్వాడ ఉదయ్‌కుమార్‌నగర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘2009లో అప్పటి ప్రభుత్వం 2.250 మం దికి ఫ్లాట్లు ఇచ్చింది. చాలా ప్లాట్లు ఖాళీగా ఉండటంతో మొదటి లబ్ధిదారులను రద్దుచేసి వేరే వారికి ప్లాట్లను కేటాయించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సహకారంతో కాలనీ అభివృద్ధి చెందడంతో చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయం కూడా ఇక్కడ ఉం డటంతో మరింత అభివృద్ధి జరుగుతోంది.


ఇక్కడ స్థలాలకు డిమాండ్‌ రావటంతో పలువురు ఖాళీస్థలాలను ఆక్రమించి వేరే వారికి విక్రయించుకుంటున్నారు. సర్పంచ్‌గా ఉన్న నేను ఈవిషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు సర్వే చేసి ఆక్రమణలు కూల్చారు. అప్పటి నుంచి నాపై నాభర్తపై ఫ్లాట్లు అమ్ముకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నా’రన్నారు. ‘పదేళ్ల క్రితం చనిపోయిన మా మామయ్య కూడా ప్లాట్లు అమ్ముతున్నారనటం ఎంతవరకు సబబు అని’ ప్రశ్నించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఉపసర్పంచ్‌ సూరబోయిన రజిత, నాగమణి, లక్ష్మీ, సిరి, కాంపాటి రవి, సాధిక్‌, రాంబా బు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-25T09:37:20+05:30 IST