Abn logo
Aug 6 2021 @ 21:55PM

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

రంగారెడ్డి: కుటుంబ కారణాలతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో విభేదాలు ఉండడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భోజనంపల్లి మురళీధర్ రైల్వే శాఖలో విధులు నిర్వహిస్తూ సీత ఎన్‌క్లేవ్ ఫేస్‌లో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా భార్యతో గొడవలు జరగడంతో భార్యా పిల్లలకు దూరంగా మురళీధర్ నివసిస్తున్నాడు. ఇంటి పక్కన నివసించే వారు దుర్వాసన రావడంతో కిటికీలో నుంచి ఇంటిలోకి చూసారు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. నాలుగు రోజుల క్రితం మురళీధర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.