ఇంగువ ఎక్కడ పండుతుంది?

ABN , First Publish Date - 2020-10-24T06:07:41+05:30 IST

వంటల్లో మంచి రుచి, వాసన కోసం ఇంగువ ఉపయోగించడం అందరూ చేసేదే. ఇంగువ శాస్త్రీయనామం అసొఫొటోడియా...

ఇంగువ ఎక్కడ పండుతుంది?

వంటల్లో మంచి రుచి, వాసన కోసం ఇంగువ ఉపయోగించడం అందరూ చేసేదే. ఇంగువ శాస్త్రీయనామం అసొఫొటోడియా. మనదేశంలో ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించని వారు వంటకాల్లో రుచి, వాసన కోసం ఇంగువ తప్పనిసరిగా వాడుతుంటారు. ఇంగువ మొక్కలు అత్యంత శీతల ప్రదేశాల్లో పెరుగుతాయి. అలెగ్జాండర్‌ కాలం నాటికే ఇంగువ ఔషధంగా, సుగంధ ద్రవ్యంగా ప్రపంచానికి తెలుసు. ఈ మొక్కలు సుమారు రెండు గజాల ఎత్తు వరకు పెరుగుతాయి.


విత్తు నాటిన తరువాత మొలకలు మంచులో కప్పబడి దీర్ఘనిద్రలోకి జారుకుంటాయి. అప్పుడు కలిగే మార్పుల వల్లే శ్రేష్ఠమైన ఇంగువ లభిస్తుంది. ఇక ఇంగువ ఎలా సేకరిస్తారంటే మొక్క వేళ్ల మీద గాట్లు పెడితే, జిగురులాంటి పదార్థం స్రవిస్తుంది. ఆఫ్ఘనిస్థాన్‌, ఇరాన్‌, ఉబ్జెకిస్థాన్‌ శీతల ఎడారుల్లో ఇది ఎక్కువగా పండుతుంది. మనం ఉపయోగించే ఇంగువ అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నదే. ఇప్పుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి లోయలో, లద్దాఖ్‌లోనూ ఈ పంట సాగు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2020-10-24T06:07:41+05:30 IST