Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అందరి బాధ్యత

  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు
  • ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

కొందుర్గు: ప్రభుత్వ ఆస్తులను కాపాడ డం అందరి బాధ్యత అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు అన్నారు. ‘కబ్జా కోర ల్లో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌’ శీర్షికన సోమవా రం ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తపై ఆయన స్పందించారు. మంగళవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో, దేశంలో పురాతన కట్టడాలను, చారిత్రక ప్రదేశాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు, ప్రజలకు, అన్ని పార్టీల రాజకీయ నాయలకులపై ఉంటుందని బక్కని అన్నారు. సొంత ఆస్తులు ఆక్రమణకు గురైతే అధికారులకు, పోలీసులకు ఆయా మనం ఫిర్యాదు చేస్తామని.. అలాగే మన కళ్లముందు ఉన్న ప్రభుత్వ ఆస్తుల విషయంలోనూ ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు స్పందించాలని కోరారు. గతంలో షాద్‌నగర్‌ లో 25ఎకరాల ప్రభుత్వ ఆస్తి ఆక్రమణకు గురైతే, వెంటనే తాను ఫిర్యాదు చేయడంతో, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు విచారణ చేయించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, ప్రస్తుతం ఆ స్థలంలోనే మార్కెట్‌ యార్డును ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. కొందుర్గు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ స్థలం కబ్జా కాకుండా త్వరలోనే అన్ని పార్టీల నాయకులతో, గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తహసీల్దార్‌తో మాట్లడారు. కబ్జా విషయం ఆంధ్రజ్యోతి పత్రిక వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఆయన వెంట స్లీవారెడ్డి, అల్ఫోన్స్‌రెడ్డి  ఉన్నారు.

Advertisement
Advertisement