Abn logo
May 22 2020 @ 05:07AM

పల్లె ప్రగతి పనులను పూర్తిచేయాలి

తిరుమలాయపాలెం, మే 21 : మండలంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ స్నేహలత ఆదేశించారు. గురువారం మండలంలోని బీరోలు, మహ్మదాపురం, ఇస్లావత్‌ తండాలో జరుగుతున్న శ్మశానవాటిక పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటిక పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.


పల్లె ప్రగతిలో గుర్తించిన పనులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతీగ్రామ పంచాయతీలో కూడా డంపింగ్‌ యార్డు నిర్మాణాలు చేపట్టాలని, మండలంలోని ఆయా ప్రాంతాల్లో పల్లె ప్రగతి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వన నర్సరీలో ప్రజలకు అవసరమైన మొక్కలను పెంచి వాటిని పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం, ఎంపీపీ బోడా మంగీలాల్‌, ఈవోఆర్‌డీ రాజేశ్వరి, ఎపీవో నర్సింహారావు, స్ధానిక సర్పంచ్‌ సునీత నర్సయ్య, వీఆర్వోలు సుధీర్‌, రోశయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement