అక్కడి జీడీపీ... టాప్...

ABN , First Publish Date - 2021-03-31T22:02:27+05:30 IST

కిందటేడాదికి సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి దిగువనే ఉండవచ్చని యునైటెడ్ నేషన్స్ ఎకానమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్(యూఎన్‌ఈఎస్‌సీఏపీ) అంచనా వేసింది.

అక్కడి జీడీపీ... టాప్...

న్యూఢిల్లీ : కిందటేడాదికి సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి దిగువనే ఉండవచ్చని యునైటెడ్ నేషన్స్ ఎకానమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్(యూఎన్‌ఈఎస్‌సీఏపీ) అంచనా వేసింది. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వేగవంతమైనప్పటికీ వివిధ కారణాలతో వృద్ధి దిగువనే ఉండే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక పేర్కొంది. 'ఎకనమిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఏషియా అండ్ ది పసిఫిక్ 2021 టువార్డ్స్ పోస్ట్ కోవిడ్ 19 రిసైలెంట్ ఎకానమీస్' పేరుతో విడుదల చేసిన  ఈ నివేదికలో భారత వృద్ధి రేటు అంచనాలను వెల్లడించింది.


ఏడు శాతంగా ఉండొచ్చు...

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఏడు శాతంగా ఉండవచ్చునని పేర్కొంది. అదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను -7.7 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద లాక్‌డౌన్ భారత్‌లో కొనసాగిందని, ఈ క్రమంలో... ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని పేర్కొంది. 2021 ఆర్ధిక సంవత్సరంలో  మొదటి త్రైమాసికం నుండి రెండో త్రైమాసికం వరకు ఈ ప్రభావం పడింది. లాక్‌డౌన్‌, ఆ తర్వాత కూడా ప్రజల ఆరోగ్యం కొరకు ఆంక్షలు విధించింది కేంద్రం. ఈ క్రమంలో...  కరోనా ప్రభావంతోపాటు కేసులు తగ్గినట్లు వెల్లడించింది. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడినట్లు పేర్కొంది.

Updated Date - 2021-03-31T22:02:27+05:30 IST