Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళలు లేనిదే ప్రపంచం లేదు: విజయశాంతి

హైదరాబాద్: మహిళల ప్రాముఖ్యతను ఎన్నటికీ మరిచిపోవద్దని, వారు లేనిదే ప్రపంచం లేదని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. గతంలో ఇంటికే పరిమితమైన మహిళలు ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల్లో ముందు నిలుస్తున్నారని చెప్పారు. ఒకప్పుడు మాట్లాడడానికి వెనకడుగు వేసిన మహిళలు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని కశిష్ ఫంక్షన్ హాల్‌లో అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలను ఘనంగా సన్మానించారు. అనంతరం విజయశాంతి మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం సేవలందించిన డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్ల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగడం లేదని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సేవా రంగంలో ఉన్న మహిళలను వెలుగులోకి తీసుకురావడానికి అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని విజయశాంతి ప్రశంసించారు.

Advertisement
Advertisement