గూగుల్‌ మ్యాప్‌ రూట్‌కు ఇవే కీలకం

ABN , First Publish Date - 2020-09-05T05:04:04+05:30 IST

దారి కనుక్కోవడంలో గూగుల్‌ మ్యాప్‌తో కలుగుతున్న ప్రయోజనాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన

గూగుల్‌ మ్యాప్‌ రూట్‌కు ఇవే కీలకం

దారి కనుక్కోవడంలో గూగుల్‌ మ్యాప్‌తో కలుగుతున్న ప్రయోజనాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎవరినీ అడగకుండా, కేవలం చిరునామా ప్రకారం, నిర్దేశిత ప్రాంతానికి చేరుకోవడం గూగుల్‌ మ్యాప్‌ సహకారంతో  సాధ్యమవుతోంది. అయితే ఈ అసాధ్యం మాటున ఉన్న ఏడు విషయాలు ఓసారి చెక్‌ చేసుకోండి..


 రోడ్లపై ట్రాఫిక్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు గూగుల్‌ మ్యాప్‌  వినియోగదారులకు తెలియజేయడం పాత విషయమే. అయితే ఇందుకోసం ఆ లొకేషన్‌లోని  అందరి డేటాను క్రోడీకిరరంచి భిన్న సాంకేతికతల సహకారంతో మొత్తం సమాచారానికి ఒక సమగ్ర రూపంలో,  కచ్చితత్వంతో అందజేస్తుంది. 

 వివిధ రహదారులపై వేర్వేరు సమయాల్లో వాహనాల కదలికను గమనించి ట్రాఫిక్‌ ప్యాటర్న్‌ను తెలుసుకుంటుంది. మెషిన్‌ లెర్నింగ్‌ సహకారంతో ఈ డేటాబే్‌సను లైవ్‌ ట్రాఫిక్‌తో అనుసంధానించి ఎప్పటికప్పుడు వాహనాల కదలికలు,  అంటే ఒక్కో వాహనం ఆయా ప్రదేశానికి చేరుకునే సమయాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఉండే ట్రాఫిక్‌ రద్దీ మధ్యాహ్నం లేదంటే రాత్రి కనిపించదు. తదనుగుణంగానే వాహనాల కదలిక ఉంటుంది. ఆ లెక్కలను పక్కాగా తీసుకుని మరీ ట్రాఫిక్‌ అంచనాలను వినియోగదారులకు గూగుల్‌ తెలియజేస్తుంది. 

 గూగుల్‌కు అనుబంధమైన ‘ఆల్ఫాబెట్‌’ సంబంధించిన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ల్యాబ్‌ ‘డీప్‌మైండ్‌’. ఈ సంస్థకు చెందిన మెషీన్‌ లెర్నింగ్‌ సహకారంతో ఒక అర్కిటెక్చర్‌ రూపొందించుకుంది. దీనికి గ్రాఫిక్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌ అని పేరుపెట్టుకుంది. ఈ నెట్‌వర్క్‌ సహాయంతో మరింత ఆక్యురసీతో గమ్యానికి ఎంత సేపట్లో చేరుతారు అన్న సమాచారాన్ని గూగుల్‌ వినియోగదారులకు అందిస్తోంది. 

 కచ్చితమైన సమాచారాన్ని అందజేయడం కోసం పదమూడేళ్ళ డేటాను వినియోగించుకుంటోంది.

 రహదారులు అన్నీ ఒకేలా ఉండవు. రహదారుల పరిస్థితి అంటే తారు, సిమెంట్‌ రోడ్లతో మొదలుకుని బురదతో ఉన్న వాటి సమాచారాన్ని తదనుగుణంగా పట్టే కాలాన్ని అంచనా వేస్తోంది. 

 ఒక మార్గంలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు ప్రత్యామ్నాయం కూడా చూపుతుంది. అదే సమయంలో అందులో ఉన్న అవాంతరాలను కూడా తెలియజేస్తుంది. మిగతా వాటితో పోల్చుకున్నప్పుడూ హైవే ఎప్పుడూ సౌకర్యంగానే ఉంటుంది.

 మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫిక్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గూగుల్‌ మ్యాప్‌ యాప్‌ నిరంతరాయంగా మెషీన్‌ లెర్నింగ్‌ను ఉపయోగించుకుంటోంది.              


Updated Date - 2020-09-05T05:04:04+05:30 IST