దొంగతనాలు చేసి పేదలకు.. పోలీసులకు చిక్కిన ‘రాబిన్‌హుడ్’!

ABN , First Publish Date - 2021-01-11T04:42:04+05:30 IST

సినిమాల్లో హీరో దొంగ అయితే ఏం చేస్తాడు? దొంగతనాలు చేసి పేదలకు పంచి పెడతాడు కదా. సరిగ్గా ఇలానే చేస్తూ నిజజీవితంలో ‘రాబిన్‌హుడ్’ అనే పేరు సంపాదించుకున్నాడో చోరుడు.

దొంగతనాలు చేసి పేదలకు.. పోలీసులకు చిక్కిన ‘రాబిన్‌హుడ్’!

న్యూఢిల్లీ: సినిమాల్లో హీరో దొంగ అయితే ఏం చేస్తాడు? దొంగతనాలు చేసి పేదలకు పంచి పెడతాడు కదా. సరిగ్గా ఇలానే చేస్తూ నిజజీవితంలో ‘రాబిన్‌హుడ్’ అనే పేరు సంపాదించుకున్నాడో చోరుడు. దేశరాజధాని ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఇతనిపై పలు దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ రాబిన్‌హుడ్ అసలు పేరు మహమ్మద్ ఇర్ఫాన్. ఇలా దొంగతనాలు చేసి సంపాదించిన సొమ్ముతో ఖరీదైన కార్లు కొనడం, అలాగే తన స్వరాష్ట్రం బిహార్‌లో సేవాకార్యక్రమాలు చేయడం ఇర్ఫాన్ ఆనవాయితీ. ఈ కారణంగానే అతన్ని చాలా మంది ‘రాబిన్ హుడ్’ అని పిలుస్తుంటారు. అతన్ని ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. దర్యాప్తులో ఇర్ఫాన్ వద్ద జాగ్వార్ వంటి ఖరీదైన కార్లు చాలా ఉన్నాయని తేలింది.

Updated Date - 2021-01-11T04:42:04+05:30 IST