ఉదయం 9లోపు చేయాల్సినవి...

ABN , First Publish Date - 2021-08-04T05:47:43+05:30 IST

ఉదయం నిద్రలేవగానే ఏం చేయాలి? బ్రేక్‌ఫాస్ట్‌ ఎప్పటిలోగా ముగించాలి? ఈ సందేహాలను పక్కన పెడితే ఉదయం తొమ్మిది గంటలలోపు చేయాల్సిన పనులు ఇవి అని సూచిస్తున్నారు నిపుణులు.

ఉదయం 9లోపు చేయాల్సినవి...

దయం నిద్రలేవగానే ఏం చేయాలి? బ్రేక్‌ఫాస్ట్‌ ఎప్పటిలోగా ముగించాలి? ఈ సందేహాలను పక్కన పెడితే ఉదయం తొమ్మిది గంటలలోపు చేయాల్సిన పనులు ఇవి అని సూచిస్తున్నారు నిపుణులు. ఆ విశేషాలు ఇవి...


మెడిటేషన్‌తో దినచర్యను ప్రారంభించండి. ఇది మీలో పాజిటివ్‌ ఎనర్జీని పెంచుతుంది. రోజంతా యాక్టివ్‌గా పనిచేయగలుగుతారు. 

ఉదయాన్నే తగినన్ని నీళ్లు తాగండి. జీర్ణశక్తి బాగుండటంతో పాటు రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండటానికి అది ఉపకరిస్తుంది.

తొమ్మిది గంటలలోపే ఒక అరగంట సమయాన్ని చదవడం కోసం కేటాయించండి. అది మంచి పుస్తకం కావచ్చు, పత్రికలు కావచ్చు. 

ఆ రోజు ఏయే పనులు చేయాలనుకుంటున్నారో, ఏ పనులు ఆ రోజు పూర్తి చేయాల్సి ఉందో చిన్న నోట్‌బుక్‌లో రాసుకోండి. ఇలా చేయడం వల్ల పనులు మరిచిపోకుండా పూర్తి చేసుకోగలుగుతారు.

ఉదయం 9లోపు ఒక అరగంట వాకింగ్‌ తప్పనిసరి. దగ్గరలో ఉన్న పార్కులో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ నడవండి. ఆరోగ్యంగా ఉండటానికి ఇది అవసరం.

మీరు ఒంటరిగా ఉన్నా, ఫ్యామిలీతో ఉన్నా బ్రేక్‌ఫాస్ట్‌ తయారుచేయడంలో సహాయపడండి. 

తొమ్మిదిలోపే స్నానం పూర్తి చేయండి. 

బ్రేక్‌ఫాస్ట్‌ను తొమ్మిదిలోపే పూర్తి చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ సిస్టమాటిక్‌గా పనిచేసి జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.

Updated Date - 2021-08-04T05:47:43+05:30 IST