Advertisement
Advertisement
Abn logo
Advertisement

కారు ప్రమాదంలో ముగ్గురు మృతి

సిద్దిపేట: జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బావిలో కారు( AP 23 R 5566)పడిన ఘటనలో దానిలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాత పడ్డారు. వీరితో పాటు వీరిని రక్షించడానికి బావిలోకి దిగిన గజ ఈతగాడు నర్సింహులు కూడా మృతి చెందారు. కారులో మృతి చెందిన వారిని తల్లి భాగ్యలక్ష్మి, కొడుకు ప్రశాంత్‌గా  పోలీసులు నిర్థారిం చారు. దుబ్బాక మండలంలోని చిట్టపుర్ గ్రామంలో బావిలో పడిన కారును ఎట్టకేలకు పైకి తీసుకు వచ్చారు.  మృతల కుటుంబ సభ్యుల, బంధువుల రోదనతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఈ ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. 


ఫొటోల కోసం క్లిక్ చేయండిసిద్దిపేట : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దుబ్బాక మండలంలోని చిట్టాపూర్ ప్రధాన రహదారి పక్కన అదుపు తప్పి కారు ( AP 23 R 5566) బావిలో పడిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న పలు శాఖల సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బావి నుంచి కారును తీసే ప్రయత్నం చేస్తున్నారు. రామాయంపేట నుంచి సిద్దిపేట వైపు కారు వెళ్తోంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బావి నుంచి నీటిని అధికారులు తోడివేస్తున్నారు. దాదాపు 45 నుంచి 60 లోతున బావి ఉంది. స్థానికి ఎమ్మెల్యే రఘనందన్ రావు అక్కడికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కారులో ఎంత మంది ఉన్నారో ఇంకా తెలియ రాలేదు. అయితే కారులో నిజాంపేట్‌కు చెందిన తల్లి, కొడుకు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. తల్లి భాగ్యలక్ష్మి, కొడుకు ప్రశాంత్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగు మోటర్లతో బావిలో నీటిని పోలీసులు, ఫైర్‌ సిబ్బంది తోడుతున్నారు. బావిలోకి గజ ఈతగాళ్లు దిగారు. ఎట్టకేలకు కారును బయటకు వెలికితీశారు. Advertisement
Advertisement