18ఏళ్ల అమ్మాయి కిడ్నాప్.. దర్యాప్తులో లీడ్ ఇచ్చిన టిక్‌టాక్ వీడియో
ABN , First Publish Date - 2021-05-10T11:14:31+05:30 IST
పదిహేడేళ్ల క్రితం కిడ్నాప్‌కు గురై కనిపించకుండా పోయిన ఒక అమ్మాయి కేసు ఛేదించడానికి ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ లీడ్ ఇచ్చింది.
వాషింగ్టన్: పదిహేడేళ్ల క్రితం కిడ్నాప్‌కు గురై కనిపించకుండా పోయిన ఒక అమ్మాయి కేసు ఛేదించడానికి ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ లీడ్ ఇచ్చింది. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్లో వెలుగు చూసింది. కెన్నెవిక్కు చెందిన సోఫియా జువారెజ్ను 2003లో వాళ్ల ఇంటికి సమీపంలోనే ఎవరో కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి ఈ కేసు మిస్టరీగానే మిగలింది. అయితే తాజాగా ఒక టిక్‌టాక్ వీడియోలో ఒక యువతి తనను ఎవరో కిడ్నాప్ చేసి ఉంచారని, తాను కుటుంబ సభ్యులను కలవడానికి ప్రయత్నిస్తున్నానని ప్రాధేయపడింది. ఆ వీడియోలో ఉన్నది సోఫియానే అని పోలీసులు గుర్తించారు. ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.