రాజన్నసిరిసిల్ల జిల్లాలో పులుల కలకలం

ABN , First Publish Date - 2021-01-14T22:00:40+05:30 IST

రాజన్నసిరిసిల్ల జిల్లాలో పులుల కలకలం రేగింది. మల్కాపూర్‌లో పులి పడిన వ్యవసాయ బావిని జిల్లా డిఎఫ్‌ఓ పరిశీలించారు.

రాజన్నసిరిసిల్ల జిల్లాలో పులుల కలకలం

సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో పులుల కలకలం రేగింది. మల్కాపూర్‌లో పులి పడిన వ్యవసాయ బావిని జిల్లా డిఎఫ్‌ఓ పరిశీలించారు. పులి బయటకు వెళ్లిన పులి అడుగులను అటవీ అధికారులు పరిశీలించారు. జగిత్యాల ఫారెస్ట్ నుంచి పులి వచ్చినట్లుగా గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు పులులు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలం సులుగుపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌, నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం మాదాపూర్‌ గ్రామాలలో బుధవారం పెద్దపులి, చిరుతపులులు సంచరిస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలకు, అటవీ శాఖ అధికారులకు కంటిమీద కునుకులేని పరిస్థితి ఏర్పడింది. ఈ మూడు ప్రాంతాలలో పులులను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బెజ్జూరు మండలం తలాయి సమీపంలోని కందిభీమన్న అటవీ ప్రాంతాన్ని సిబ్బంది బుధవారం డ్రోన్‌ కెమెరాలతో జల్లెడ పట్టింది. 

Updated Date - 2021-01-14T22:00:40+05:30 IST