Abn logo
Mar 1 2021 @ 00:06AM

పొడవుగా కనిపించాలంటే..!

పొట్టిగా ఉండే అమ్మాయిలు పొడవుగా కనిపించాలంటే కొన్ని ఫ్యాషన్‌ టిప్స్‌ ఫాలో కావాలి. అవేమిటంటే...


  1. పొట్టిగా ఉండే అమ్మాయిలకు హైవైస్టెడ్‌ ప్యాంట్లు, స్కర్ట్టులు, సూట్లు వేసుకున్నప్పుడు కాళ్లు పొడవుగా కనిపిస్తాయి. 
  2. జీన్స్‌ లేదా  ప్యాంట్స్‌ వేసుకుంటే మ్యాచింగ్‌ షూస్‌ వేసుకోవాలి. అలా ఒకే రంగు ప్యాంటు, షూస్‌ వేసుకోవడం వల్ల రంగు కలిసిపోయి చూడగానే పొడుగ్గా కనిపిస్తారు. 
  3. లెగ్గింగ్స్‌, కుర్తీ వేసుకున్నప్పుడు వాటికి తగ్గ రంగు షూస్‌ ఎంచుకోవాలి.
  4. హైవైస్టెడ్‌ ప్యాంట్లు, స్కర్టులు వేసుకున్నప్పుడు క్రాప్‌ టాప్స్‌ ధరించాలి. షర్టులు వేసుకుంటే టక్‌ చేసుకోవాలి.  
  5. పలాజో ప్యాంట్లు లేదా లూజు బాటమ్‌ ప్యాంట్ల మీదకు హీల్స్‌ మంచి ఎంపిక.  
  6. పెద్ద ప్రింట్లు ఉన్న దుస్తులు ఎంచుకోవద్దు. ఎందుకంటే అవి వేసుకుంటే మరింత పొట్టిగా కనిపిస్తారు. నిలువు గీతలు ఉన్న ప్రింట్లు లేదా ‘వి’ షేప్‌ ఉన్న టీషర్ట్స్‌ షర్ట్స్‌ మంచి ఛాయిస్‌.
  7. టాప్‌ నాట్‌ హెయిర్‌ స్టయిల్‌ ఫాలో అవ్వాలి.   హైబన్‌ వేసుకుని మిగతా జట్టును కిందికి వదిలేయాలి. ఈ హెయిర్‌ స్టైయిల్‌లో అస్సలు పొట్టిగా కనపడరు.  
  8. జీన్స్‌, ఏదైనా డ్రెస్‌ మీదకు స్టయిల్‌ కోసం    స్కిన్నీగా ఉండే బెల్టులను మాత్రమే వాడాలి. దాంతో అందంగా, పొడవుగా కనిపిస్తారు.