తిరుపతిలో కరోనా యోధులకు ఫొటోలు మాత్రమే.. డబ్బుల్లేవ్!

ABN , First Publish Date - 2020-08-11T14:34:05+05:30 IST

రాష్ట్ర ఖజనా ఖాళీ అవటంతో కొవిడ్‌ డిస్చార్జ్‌ సమయంలో ఇస్తున్న రెండు వేలను ప్రభుత్వం నిలిపివేసింది.

తిరుపతిలో కరోనా యోధులకు ఫొటోలు మాత్రమే.. డబ్బుల్లేవ్!

తిరుపతి: రాష్ట్ర ఖజనా ఖాళీ అవటంతో కొవిడ్‌ డిశ్చార్జ్‌ సమయంలో ఇస్తున్న రెండు వేలను ప్రభుత్వం నిలిపివేసింది. సిబ్బంది గత నాలుగు రోజులుగా రోగులకు ఒకే రూ.2000లను డిశ్చార్జ్‌  సమ్మరికి కుట్టి ఫోటోలు తీసుకుంటోంది. తిరుపతిలోని అన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ వద్ద, కొవిడ్‌ ఆసుపత్రుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఫోటోలు మాత్రం తీసుకుని డబ్బులు ఇవ్వక పోవటంతో డిశ్చార్జ్ రోగుల విస్మయానికి గురవుతున్నారు. సిబ్బంది కొట్టేస్తున్నారని కొవిడ్ బాధితులు భావిస్తుండగా... ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని సిబ్బంది చెబుతోంది. అయితే ప్రజలు తమను దొంగలనుకునేలా పని చేయిస్తున్న అధికారుల తీరుపై సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-08-11T14:34:05+05:30 IST