పారిశుధ్య సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-04-09T09:58:17+05:30 IST

మునిసిపల్‌, పంచాయతీ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరించి రాష్ట్రంలో పారిశుధ్య నిర్వహణా వ్యవస్థని పటిష్టపరచాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్యమంత్రి కెసీఆర్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి

పారిశుధ్య సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 ( ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌, పంచాయతీ  ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరించి రాష్ట్రంలో పారిశుధ్య నిర్వహణా వ్యవస్థని పటిష్టపరచాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్యమంత్రి కెసీఆర్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.  కరోనా వైరస్‌ కట్టడికి కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రోత్సాహకాలు ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులలో దళితులు, బలహీన వర్గాలవారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. 

Updated Date - 2020-04-09T09:58:17+05:30 IST