Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్‌కు బెల్జియం సవాల్‌

నేడు జూ. హాకీ వరల్డ్‌కప్‌ క్వార్టర్స్‌

భువనేశ్వర్‌: జూనియర్‌ హాకీ వరల్డ్‌క్‌పలో జోరుమీదున్న డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌కు కఠిన సవాల్‌ ఎదురుకానుంది. బుధవారం జరిగే క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో బలమైన బెల్జియంతో టీమిండియా చావోరేవో తేల్చుకోనుంది. ఒకరకంగా ఇది 2016 ఫైనల్‌ రీమ్యాచ్‌ లాంటింది. అప్పడు జరిగిన టైటిల్‌ ఫైట్‌లో బెల్జియంను ఓడించి భారత్‌ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో పూల్‌-బిలో ఆడిన భారత్‌.. తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ చేతిలో కంగుతిన్నా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొంది. కెనడా, పోలెండ్‌ను చిత్తు చేసి గ్రూప్‌లో రెండు స్థానంతో క్వార్టర్స్‌కు చేరుకుంది. ఉత్తమ్‌ సింగ్‌, అరైజిత్‌ సింగ్‌, సుదీప్‌ చిర్మాకో, మణీందర్‌ సింగ్‌తో భారత అటాక్‌ ఎంతో బలంగా కనిపిస్తోంది. మరోవైపు పెనాల్టీ కార్నర్‌ నిపుణుడు సంజయ్‌ కుమార్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అయితే, డిఫెన్స్‌ కొంత బలహీనంగా ఉండడం భారత్‌ను ఆందోళనకు గురి చేసే అంశం. మరోవైపు పవర్‌ హాకీతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న బెల్జియం పూల్‌-ఎలో సౌతాఫ్రికా, చిలీపై నెగ్గి.. మలేసియాతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 

Advertisement
Advertisement