జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌నకు యాసిన్ ఎంపిక
ABN , First Publish Date - 2022-01-28T09:18:05+05:30 IST
అజర్‌బైజాన్ రాజధాని బాకులో ఫిబ్రవరి 12, 13 తేదీలలో జరిగే ట్రంపోలిన్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌నకు..
ఆర్థిక ఇబ్బందులతో టోర్నీలో పాల్గొనడంపై అనుమానాలు
దాతల సాయానికి ఎదురుచూపులు
కాకినాడ స్పోర్ట్స్: అజర్‌బైజాన్ రాజధాని బాకులో ఫిబ్రవరి 12, 13 తేదీలలో జరిగే ట్రంపోలిన్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌నకు విజయవాడకు చెందిన యాసిన్ ఎంపికైంది. జాతీయ స్థాయిలో సత్తాచాటి ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్‌నకు ఎంపికైన యాసిన్‌కు ఆ పోటీలలో పాల్గొనేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా నిలుస్తున్నాయి. ఆమె తండ్రి గౌస్ పెయింటర్‌గా జీవితం వెళ్లదీస్తున్నాడు. బాకు టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు రూ.లక్షా 25 వేలు ఖర్చవుతుందని చెబుతున్న యాసిన్..అంత పెద్దమొత్తం తన తండ్రి భరించలేడని తెలిపింది. వరల్డ్ కప్‌లో తప్పనిసరిగా పతకం సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్న ఆమె..దాతలు సాయం చేయాలని వేడుకుంది. దాతలు 93921 26777 నంబరులో సంప్రదించాలని కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో శిక్షణ పొందుతున్న యాసిన్ కోరింది.