నేటి నుంచి పోలీసులకు అనుమతి అక్కర్లేదు

ABN , First Publish Date - 2020-05-23T14:19:48+05:30 IST

అమరావతి: నేటి నుంచి పోలీసులకు ఆంక్షలను డీజీపీ సడలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్లాలన్నా నేటి నుంచి పోలీసులకు ఎటువంటి అనుమతి అవసరం లేదు.

నేటి నుంచి పోలీసులకు అనుమతి అక్కర్లేదు

అమరావతి: నేటి నుంచి పోలీసులకు ఆంక్షలను డీజీపీ సడలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్లాలన్నా నేటి నుంచి పోలీసులకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగవచ్చు. కారులో డ్రైవర్ కాకుండా మరో ముగ్గురు ప్రయాణం చెయ్యొచ్చు. ఇతర భారీ వాహనాల్లో వాటి సీట్ల సామర్థ్యంలో 50 శాతం ప్రయాణికులతో ప్రయాణించాలి. ఇప్పటివరకూ ఇతర జిల్లాలకు..


రాష్ట్రాలకు వెళ్లాలంటే పోలీసులు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు జిల్లాలు వెళ్లేందుకు ఎటువంటి పాసులు అవసరం లేదంటూ డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు కేవలం కంటైన్మెంట్ జోన్‌లకే  పరిమితం చేసిన కారణంగా డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇతర జిల్లాలకు వెళ్లేవారు అత్యవసరమైతేనే వెళ్ళాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు అత్యవసరంగా వెళ్ళవలసిన వారు వారి అత్యవసర పరిస్థితి నిరూపించే సాక్ష్యాధారాలతో దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ సూచించారు. 


Updated Date - 2020-05-23T14:19:48+05:30 IST