Tokyo Olympics: నైజీరియన్ స్ప్రింటర్ బ్లెస్సింగ్ ఒకాగ్‌బరే సస్పెండ్

ABN , First Publish Date - 2021-07-31T13:17:58+05:30 IST

నైజీరియన్ స్ప్రింటర్ బ్లెస్సింగ్ ఒకాగ్‌బరే డ్రగ్ టెస్టులో విఫలమై టోక్యో ఒలింపిక్స్ నుంచి సస్పెన్షన్‌కు...

Tokyo Olympics: నైజీరియన్ స్ప్రింటర్ బ్లెస్సింగ్ ఒకాగ్‌బరే సస్పెండ్

డ్రగ్ టెస్టులో విఫలం

టోక్యో (జపాన్): నైజీరియన్ స్ప్రింటర్ బ్లెస్సింగ్ ఒకాగ్‌బరే  డ్రగ్ టెస్టులో విఫలమై టోక్యో ఒలింపిక్స్ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. టోక్యో ఒలింపిక్స్ లో గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో ఒకాగ్‌బరే‌పై మొదటి డోపింగ్ కేసు నమోదు చేశామని టోక్యో ఒలింపిక్స్ అధికారులు శనివారం చెప్పారు. శుక్రవారం జరిగిన మహిళల 100 మీటర్ల ప్రారంభ పోటీలో విజయం సాధించిన ఒకాగ్‌బరే పెరుగుదల కోసం హార్మోన్స్ వాడారని పరీక్షల్లో తేలింది. డోపింగ్ పరీక్షలో పాజిటివ్ రావడంతో ఒకాగ్‌బరేను ఒలింపిక్స్ పోటీల నుంచి నిషేధించారు.డోపింగ్ పరీక్ష ఫలితాన్ని క్రీడా నిర్వాహకులు ఒకాగ్‌బరేకు తెలిపారు. 


కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత అయిన ఒకాగ్‌బరే (32) శుక్రవారం 11.05 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నారు. ఒలింపిక్స్‌లో ఒక సమస్యాత్మక ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో స్ప్రింటర్  ఒకాగ్‌బరే సస్పెన్షన్ తాజా ట్విస్ట్. దీంతో 10 మంది నైజీరియన్ అథ్లెట్లను ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనకుండా నిరోధించామని నిర్వాహకులు చెప్పారు.


Updated Date - 2021-07-31T13:17:58+05:30 IST