Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 25 2021 @ 19:35PM

27,28న కాంగ్రెస్ వరి దీక్ష: రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌: ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 ఇందిరాపార్క్ దగ్గర వరి దీక్ష చేపడతామని టీపీసీసీ  రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మహబూబ్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ పాలమూరు ద్రోహి కేసీఆర్‌ అని అన్నారు. పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. పాలమూరు బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్‌లు కావద్దా, బానిసలుగానే బ్రతకాలా అని ఆయన ప్రశ్నించారు. పాలమూరు జిల్లాని అభివృద్ది చేసే బాధ్యత తనదేనన్నారు. గుడిని, గుడిలో లింగాన్ని దోచేవాడు మంత్రి నిరంజన్‌రెడ్డి అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోట్ల కట్టలు లేనిదే నిరంజన్‌రెడ్డి ఏ పని చేయరన్నారు. వరి ధాన్యంపై టీఆర్ఎస్‌, బీజేపీ డ్రామాలాడుతున్నాయన్నారు. తెలంగాణ, రైతు ద్రోహి కేసీఆర్‌ అని ఆయన పేర్కొన్నారు. Advertisement
Advertisement