Advertisement
Advertisement
Abn logo
Advertisement

భట్టిని కలిసిన రేవంత్‌

హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మంగళవారం టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కలిశారు. కొన్ని రోజులుగా రేవంత్‌రెడ్డికి భట్టి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. ఉదయం మల్లు రవితో చర్చల తర్వాత రేవంత్‌ భట్టిని కలిశారు. రేపటి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని  రేవంత్‌రెడ్డి కోరారు. 


టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరుస భేటీలతో బిజీ బిజీ అయ్యారు. వరుసగా కాంగ్రెస్ అగ్రనాయకులను కలుస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మాజీ మంత్రి శ్రీధర్ బాబును దోమలగూడాలోని ఆయన నివాసానికి వెళ్లి కలుస్తారు. 3.30 గంటలకు సీఎల్పీ నేత  భట్టి విక్రమార్క‌తో సమావేశం,  4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇంటి దగ్గర రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకూర్ ప్రెస్ మీట్,  అలాగే సాయంత్రం 4.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మల్లు రవి ఇంటి వద్ద  ప్రెస్‌మీట్ ఉంటుంది. కాగా సాయంత్రం 6 గంటలకు మాజీ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి నివాసానికి రేవంత్‌రెడ్డి వెళ్తారు. ఉత్తమ్‌తో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై మాట్లాడతారని సమాచారం. అలాగే రేపటి టీపీసీసీ బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లపై ఉత్తమ్‌తో రేవంత్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement
Advertisement