స్థానికత ఆధారంగానే బదిలీలు చేయాలి

ABN , First Publish Date - 2022-01-23T04:36:27+05:30 IST

స్థానికత ఆధారంగానే బదిలీలు చేయాలని

స్థానికత ఆధారంగానే బదిలీలు చేయాలి
ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

  • జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జనవరి 22 : స్థానికత ఆధారంగానే బదిలీలు చేయాలని టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గాలయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాములయ్య, వెంకటప్ప, తెలంగాణ పీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని శనివారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. సీనియారిటీ ప్రకారం బదిలీలు చేపట్టడం, సీనియారిటీ జాబితాలో దొర్లిన తప్పులను సరిచేయకుండానే బదిలీలు చేయడం వల్ల సీనియర్లు జూనియర్లుగా.. జూనియర్లు సీనియర్లుగా మారారని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో కారణంగా ఉపాధ్యాయలకు అన్యాయం జరుగుతుందని, కొందరు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టేంత వరకు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో కర్ణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-23T04:36:27+05:30 IST