కోనవాగులో చిక్కుకున్న గిరిజనులు

ABN , First Publish Date - 2020-11-28T09:31:50+05:30 IST

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కందాడు పంచాయతీ శివగిరి కాలనీ సమీపంలోని కోనవాగులో 8మంది గిరిజనులు చిక్కుకుపోయారు

కోనవాగులో చిక్కుకున్న గిరిజనులు

డ్రోన్‌ ద్వారా ఆహారం సరఫరా ..

కాపాడబోయి ప్రమాదంలో  చిక్కుకున్న అగ్నిమాపక సిబ్బంది


ఏర్పేడు, నవంబరు 27: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కందాడు పంచాయతీ శివగిరి కాలనీ సమీపంలోని కోనవాగులో 8మంది గిరిజనులు చిక్కుకుపోయారు. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. కందాడు పంచాయతీకి చెందిన ఓ రైతు మామిడి తోటకు వీరు కాపలా ఉంటున్నారు. తుఫాను ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు కోనవాగు ఉధృతంగా ప్రవహించడంతో తోటలో చిక్కుకుపోయారు. అధికారులు వారికి డ్రోన్‌ ద్వారా ఆహారం సరఫరా చేశారు. చిత్తూరు నుంచి వచ్చిన ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది బోటు సాయంతో గిరిజనులను కాపాడటానికి వాగులోకి దిగారు.


బోటు అదుపు తప్పడంతో ఇద్దరు నీటిలో పడిపోయారు. వారిని తాడు సాయంతో ఒడ్డుకు చేర్చేందుకు అధికారులతో పాటు ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి ప్రయత్నించారు. అయితే సిబ్బంది తాడు వదిలేయడంతో నీటిలో కొట్టుకుపోయారు. వాగులో కొంతదూరం వెళ్లి ఓ చెట్టును పట్టుకున్నారు. స్థానికుల సయంతో అగ్నిమాపక సిబ్బంది వారిని ఒడ్డుకు చేర్చారు. పరిస్థితి విషమంగా మారిన ఉద్యోగి హెండ్రీ(30)ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బోటులో వెళ్లిన సిబ్బందిలో ముగ్గురు తోటలో గిరిజనులతోనే ఉన్నారు. శనివారం ఉదయం వారిని బయటకు తీసుకువస్తామని అధికారులు చెప్పారు. సిబ్బందిని కాపాడటానికి కృషి చేసిన నాగరాజుకు, వెంకటరమణకు తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేశ్‌రెడ్డి రూ.10వేలు బహుమతి అందించారు. 


స్థానికుల సయంతో అగ్నిమాపక సిబ్బంది వారిని ఒడ్డుకు చేర్చారు. పరిస్థితి విషమంగా మారిన ఉద్యోగి హెండ్రీ(30)ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బోటులో వెళ్లిన సిబ్బందిలో ముగ్గురు తోటలో గిరిజనులతోనే ఉన్నారు. శనివారం ఉదయం వారిని బయటకు తీసుకువస్తామని అధికారులు చెప్పారు. సిబ్బందిని కాపాడటానికి కృషి చేసిన నాగరాజుకు, వెంకటరమణకు తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేశ్‌రెడ్డి రూ.10వేలు బహుమతి అందించారు. 

Updated Date - 2020-11-28T09:31:50+05:30 IST