ట్రంప్ ఖాతా సస్పెన్షన్ ఎఫెక్ట్ ... క్షీణించిన ట్విట్టర్ షేర్ ధర...

ABN , First Publish Date - 2021-01-12T00:47:45+05:30 IST

వివాదాస్పదంగా మారిన డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపధ్యంలో అమెరికాలో చెలరేగిన హింసాకాండతో ఆయన ఖాతాను ట్విట్టర్ తొలగించిన విషయం తెలిసిందే . కాగా... దీని ప్రభావం యూఎస్ లో ట్విట్టర్ షేర్ల మీద పడింది. ట్రంప్ తన మద్దతుదారులతో ఈ నెల ఆరవ తేదీ(బుధవారం) వాషింగ్టన్ లో జో బిడెన్ అధ్యక్షుడిగా ఎలక్టోరల్ కాలేజీ ధృవీకరణను నిరసిస్తూ ర్యాలీని నిర్వహించడమే కాకుండా విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.

ట్రంప్ ఖాతా సస్పెన్షన్ ఎఫెక్ట్ ... క్షీణించిన ట్విట్టర్ షేర్ ధర...

శాన్‌ఫ్రాన్సిస్‌కో : వివాదాస్పదంగా మారిన డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపధ్యంలో అమెరికాలో చెలరేగిన హింసాకాండతో ఆయన ఖాతాను ట్విట్టర్ తొలగించిన విషయం తెలిసిందే . కాగా... దీని ప్రభావం యూఎస్ లో ట్విట్టర్ షేర్ల మీద పడింది. ట్రంప్ తన మద్దతుదారులతో ఈ నెల ఆరవ తేదీ(బుధవారం) వాషింగ్టన్ లో జో బిడెన్ అధ్యక్షుడిగా ఎలక్టోరల్ కాలేజీ ధృవీకరణను నిరసిస్తూ ర్యాలీని నిర్వహించడమే కాకుండా విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.


ఆ రోజు జరిగిన హింసాకాండలో నలుగురు మృతి చెందారు. ట్రంప్ తన అధ్యక్ష పదవి చివరి రోజులలో రెండవ అభిశంసనను ఎదుర్కొంటున్నారు .శాంతియుతంగా అధికార మార్పిడికి భంగం కలిగించే ప్రయత్నంలో డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు కాపిటల్ పై దాడి చేసిన తరువాత ఆయన రాజీనామా కోసం ఆందోళనలతో కూడిన డిమాండ్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా సంస్థలైన ట్విట్టర్ , ఫేస్‌బుక్ సంస్థలపై విరుచుకుపడే యోచనతో... ట్రంప్ తన పదవీకాలం చివరి వంద రోజుల్లో రాజీనామా చేసే ఆలోచనలో లేరని, మరింత విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారని ఎఫ్‌బీఐ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు... ట్రంప్ ఖాతాలను ట్విట్టర్, ఫేస్‌బుక్ తొలగించాయి. 


ట్రంప్ మంగళవారం టెక్సాస్‌లోని అలమో పర్యటనతో ప్రారంభించి, తన విధాన విజయాలను ప్రచారం చేయడానికి ప్రయత్నించడం ద్వారా... పదవీకాలం చివరిరోజుల్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా భావిస్తున్నారు.  కాగా...జర్మనీలో ట్విట్టర్ షేర్లు క్షీణించాయి. ట్రంప్ ఖాతా సస్పెన్షన్ తర్వాత జర్మనీలో ట్విట్టర్ షేర్లు 8 % క్షీణించాయి . సోషల్ మీడియా సంస్థ  యుఎస్-లిస్టెడ్ షేర్లు సోమవారం ఉదయం ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో 8 % మేర క్షీణించిన ట్లుగా వినవస్తోంది. ట్రంప్ ఖాతాను శుక్రవారం ఆలస్యంగా నిలిపివేసిన తరువాత తిరిగి ఈ వారంలో మొదటి ట్రేడింగ్ రోజున ట్విట్టర్ జర్మన్-లిస్టెడ్ షేర్లు 8 % మేర క్షీణించాయి. 


Updated Date - 2021-01-12T00:47:45+05:30 IST