ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికన్ సెలబ్రిటీలు!

ABN , First Publish Date - 2020-10-01T05:40:40+05:30 IST

డివైడ్ అండ్ విన్.. ఇదేనా ట్రంప్ పాలసీ? రెండో సారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు

ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికన్ సెలబ్రిటీలు!

వాషింగ్టన్: డివైడ్ అండ్ విన్.. ఇదేనా ట్రంప్ పాలసీ? రెండో సారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ట్రంప్ వ్యూహం మార్చారా? అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హీట్ పెరుగుతోంది. అగ్రరాజ్య చరిత్రలో ఇవి 59వ అధ్యక్ష ఎన్నికలు. కొవిడ్-19 పడగవిప్పి బలంగా కాటేసిన పరిస్థితుల్లో అమెరికన్లు తమ అధ్యక్షుడిని నవంబర్ మూడో తేదీన ఎన్నుకోబోతున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అభిశంసన మచ్చ పడి మళ్లీ బరిలో దిగిన అధ్యక్షుల్లో ట్రంప్ రెండో వారు. రెండో సారి తన ఎన్నిక ఖాయమని ట్రంప్ విశ్వసిస్తున్నారు. అందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో అమెరికన్లే ఫస్ట్ అంటూ దేశీయుల్లో భావోద్వేగాన్ని ట్రంప్ రగిల్చారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అంటూ నినదించారు. పక్కా బిజినెస్‌మ్యాన్ అయిన ట్రంప్.. వ్యాపార తెలివితేటలను రంగరించి అప్పట్లో ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. ఆ భావోద్వేగ ఏకీకరణ వ్యూహం ఫలించింది. ట్రంప్‌కే అధ్యక్ష పీఠం దక్కింది. మరింత సమాచారాన్ని పైవీడియోలో చూడగలరు. 

Updated Date - 2020-10-01T05:40:40+05:30 IST