Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్: శశాంక్ గోయల్

హైదరాబాద్: రాష్ట్రంలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరుగుతుందని ABNతో సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల‌ కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఉ.8 నుంచి సా. 4 వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. కరోనా దృష్ట్యా ప్రతి పోలింగ్ బూత్‌లో మెడికల్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. సీఈసీ ఇచ్చిన నోటీసులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఆయన పేర్కొన్నారు. రాజకీయపార్టీల ఇచ్చిన ఫిర్యాదులను సీఈసీకి పంపామన్నారు. సీఈసీ సూచనల మేరకు ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ABNతో శశాంక్‌ అన్నారు. 


Advertisement
Advertisement