‘దళితజ్యోతి’లో మాదిగల వాటా తేల్చాలి

ABN , First Publish Date - 2021-04-18T05:57:22+05:30 IST

‘దళితజ్యోతి’లో మాదిగల వాటా తేల్చాలి

‘దళితజ్యోతి’లో మాదిగల వాటా తేల్చాలి
సమావేశంలో మాట్లాడుతున్న వంగపల్లి శ్రీనివాస్‌

ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌

కాళోజీ జంక్షన్‌, ఏప్రిల్‌ 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితజ్యోతి పథకంలో మాదిగల వాటా ఎం తో సీఎం కేసీఆర్‌ తేల్చాలని ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశా రు. శనివారం హన్మకొండలోని హరిత హోటల్‌లో ఎమ్మార్పీఎస్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు ఇల్లందుల రాజే ష్‌ ఖన్నా అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల్లో మాదిగలకు జనాభా ప్రాతిపదికన రూ.10 వేల కోట్లు ఇవ్వాలని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. నిరుపేదలైన మాదిగలకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు, మూడెకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇన్‌చార్జి సాతూరి వెంకన్న మాదిగ, కోర్‌ కమిటీ సభ్యులు రామంచ సారయ్య మాదిగ, పందుల సంజీవ, మేడ స్వామి, నల్గొండ సదానందం, చిలువేరు సుధాకర్‌, సతూరి కోమల, జన్ను సంతోష తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-18T05:57:22+05:30 IST