ఈసారీ ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-09-18T09:02:13+05:30 IST

ఈసారీ ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఈసారీ ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

భక్తులు, సిబ్బంది ఆరోగ్యం కోసమే నిర్ణయం

టీటీడీ చైర్మన్‌ వైవీ 


తిరుమల, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను గతేడాది తరహాలో ఈసారి కూడా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కొవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రతా దృష్య్టా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రోజుకు 15 నుంచి 20 వేల మంది భక్తులకు మాత్ర మే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామి దర్శనం కల్పిస్తున్నట్టు తెలిపారు. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే కార్యక్రమం సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని, వారంలోపే ఈ సమస్యను అధిగమించి ఆన్‌లైన్‌ ద్వారా టోకెన్లను జారీ చేస్తామన్నారు.

Updated Date - 2021-09-18T09:02:13+05:30 IST