పరువునష్టం కేసులో టీటీడీ తీరును ఖండించిన బీజేపీ

ABN , First Publish Date - 2020-10-21T18:55:14+05:30 IST

పరువునష్టం కేసులో టీటీడీ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రెస్ క్లబ్‌లో బుధవారం మాట్లాడిన బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి... రమణదీక్షితులు, విజయసాయి రెడ్డిలకు అనుకూలంగా టీటీడీ నిర్ణయం తీసుకోవడాన్ని ప్రశ్నించారు.

పరువునష్టం కేసులో టీటీడీ తీరును ఖండించిన బీజేపీ

తిరుపతి: పరువునష్టం కేసులో టీటీడీ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రెస్ క్లబ్‌లో బుధవారం మాట్లాడిన బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి... రమణదీక్షితులు, విజయసాయి రెడ్డిలకు అనుకూలంగా టీటీడీ నిర్ణయం తీసుకోవడాన్ని ప్రశ్నించారు. కోర్టులో కేసు వేసేందుకు కట్టిన రెండు కోట్ల రూపాయలను వడ్డీ కాసుల వాడికి వడ్డీతో సహా కట్టాలని డిమాండ్ చేశారు. టీటీడీ ధార్మిక సంస్థను రాజకీయ వేదికగా వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరి కోసం, ఎందుకు ఆ రోజు పరువు నష్టం దావా వేశారని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు విత్‌ డ్రా చేసుకుంటారన్నారు. 


ఎవరిని తృప్తి పరచటానికి ఆ రోజు రెండు కోట్లు కట్టి కోర్టులో కేసు వేశారన్నారు. ఎవరిని తృప్తి పరచటానికి ఈ రోజు కేసును విరమించుకుంటున్నారని అడిగారు. అప్పటి పాలకులు, పాలకమండలి, ఇప్పటి పాలకులు, పాలకమండలి, రమణదీక్షితులు ఆ రెండు కోట్ల రూపాయలను వడ్డీతో సహా కట్టాలన్నారు. భగవంతుడిపై అసత్య ప్రచారం చేస్తూ మాట్లాడిన రమణదీక్షితులు తీరు దారుణమని, హుండీలో కానుకలు వేయవద్దని చెప్పిన రమణదీక్షితులును ఎందుకు టీటీడీలోకి తీసుకున్నారన్నారు. 


రమణదీక్షితులు, విజయసాయి రెడ్డిలపై పెట్టిన కేసులను విత్‌ డ్రా చేసుకుంటూ వేసిన పిటిషన్‌పై విచారణ నవంబర్ 2కి వాయిదా పడింది. ఈ మేరకు 10వ అదనపు జిల్లా జడ్జి కోర్టు పేర్కొన్నారు. టీటీడీ పరువు నష్టం కేసులో ఇంప్లీడ్ పిటిషన్‌పై నవంబర్ 2 లోపు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ హిందూ జనశక్తిని జడ్జి ఆదేశించారు. 

Updated Date - 2020-10-21T18:55:14+05:30 IST