ఆటో ప్యాకేజి భేష్‌

ABN , First Publish Date - 2021-09-16T08:14:52+05:30 IST

కేంద్రం ప్రకటించిన కొత్త పీఎల్‌ఐ పథకంతో ఆటో రంగంలో భవిష్యత్‌ టెక్నాలజీల వినియోగానికి ప్రేరణ లభించనుందని టీవీఎస్‌ మోటార్‌ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ అన్నారు.

ఆటో ప్యాకేజి భేష్‌

కేంద్రం ప్రకటించిన కొత్త పీఎల్‌ఐ పథకంతో ఆటో రంగంలో భవిష్యత్‌ టెక్నాలజీల వినియోగానికి ప్రేరణ లభించనుందని టీవీఎస్‌ మోటార్‌  చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ అన్నారు. కరోనా సంక్షోభం ప్రతి అంశంలో స్వయం సమృద్ధి ఆవశ్యకతను నేర్పిందని ఆయన పేర్కొన్నారు.  వాహన రంగంలోని అన్ని విభాగాలకు ఊతమిచ్చేలా కేంద్రం పీఎల్‌ఐ పథకాన్ని సవరించిందని, వాహన ఎగుమతులు మరింతగా పెరిగేందుకుఇది దోహదపడనుందని అశోక్‌ లేలాండ్‌ ఎండీ, సీఈఓ విపిన్‌ సోంధీ  అభిప్రాయపడ్డారు. ఆటో రంగంలో ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌ ఇంధన వాహనాల తయారీని ప్రోత్సహించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు భారీ పరిశ్రమల కార్యదర్శి అరుణ్‌ గోయల్‌ అన్నారు. దేశీయ ఆటో రంగంలో స్వయం సమృద్ధి సాధనతోపాటు అంతర్జాతీయంగా పోటీపడేలా, భవిష్యత్‌ అవసరాల కోసం సిద్ధం చేసేందుకు ఈ పథకం దోహదపడనుందని ఆటోమోటివ్‌ విడిభాగాల తయారీ దారుల సంఘం (ఏసీఎంఏ) అధ్యక్షులు సంజయ్‌ కపూర్‌ అన్నారు. 

Updated Date - 2021-09-16T08:14:52+05:30 IST