Abn logo
Apr 11 2021 @ 08:20AM

48 తులాల బంగారం, 53 తులాల వెండి చోరీ.. ఇద్దరు అరెస్ట్

  • పట్టపగలే ఇల్లు గుల్ల.. ఇద్దరు దొంగల అరెస్టు
  • 48.5 తులాల బంగారం, రూ. 1.55లక్షలు స్వాధీనం


హైదరాబాద్‌ : పట్ట పగలే తాళాలు పగుల గొట్టి..  చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగల ఆట కట్టించారు రాచకొండ పోలీసులు. వారి నుంచి 48..5 తులాల బంగారం, 53.4 తులాల వెండి, రూ. 1.55 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఎల్‌బీనగర్‌ క్యాంపు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.


యాప్రాల్‌కు చెందిన మొలుగు వీరారెడ్డి గతనెల-16న మధ్యాహ్నం 2:00లకు ఇంటికి తాళం వేసి నాచారంలో ఉన్న చాంద్‌పాషా దర్గాకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం 5:00లకు తిరిగి ఇంటికి వెళ్లగా ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా.. బంగారం, వెండి, నగదు చోరీజరిగినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్‌, మల్కాజిగిరి సీసీఎస్‌ పోలీసులు రగంలోకి దిగి టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరించి నిందితులను గుర్తించారు. యాప్రాల్‌కు చెందిన ఇద్దరు ఘరానా నిందితులు రోషన్‌ కుమార్‌ సింగ్‌.. అలియాస్‌ రోషన్‌ అలియాస్‌ దీపూ, మల్లెపు చేతన్‌.. అలియాస్‌ మోనీని అరెస్టు చేశారు. బిహార్‌కు చెందిన రోషన్‌ కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి యాప్రాల్‌ ప్రాంతంలో వ్యాపారం చేస్తూ స్థిరపడ్డారు. చేతన్‌, రోషన్‌ స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసై వీరు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 


Advertisement
Advertisement
Advertisement