Nagpur: టీనేజ్ సోదరితో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని చంపిన సోదరులు

ABN , First Publish Date - 2021-08-19T15:44:48+05:30 IST

తన టీనేజ్ సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఇద్దరు సోదరులు కలిసి హతమార్చిన ఘటన...

Nagpur: టీనేజ్ సోదరితో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని చంపిన సోదరులు

నాగపూర్ (మహారాష్ట్ర): తన టీనేజ్ సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఇద్దరు సోదరులు కలిసి హతమార్చిన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో వెలుగుచూసింది. నాగపూర్ నగరంలోని కపిల్ నగర్ గడ్డిగోడం ప్రాంతానికి చెందిన కమలేష్ బందు సహారే వివాహమైనా, భార్య వదిలేసింది. దీంతో కమలేష్ కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి నివశిస్తున్నాడు. మహదా కాలనీలోని టీనేజ్ యువతితో సంబంధం పెట్టుకున్న కమలేష్ అమ్మాయికి మొబైల్ ఫోన్ కూడా బహుమతిగా ఇచ్చాడు. తల్లిదండ్రులు వివాహితుడితో సంబంధం పెట్టుకోవడాన్ని వ్యతిరేకించారు.


 దీంతో బాలిక ఫిర్యాదు మేర కమలేశ్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ఎ కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.రెండు వారాల పాటు జైలులో ఉన్న కమలేశ్ విడుదలయ్యాక మళ్లీ సోదరి వద్దకు వస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన బాలిక సోదరులిద్దరూ వారి స్నేహితులతో కలిసి కమలేశ్ ను పట్టుకొని కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు బాలిక సోదరులపై ఐపీసీ సెక్షన్ 302, 34 ప్రకారం కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-08-19T15:44:48+05:30 IST