ప్రభుత్వంలో... రెండుగ్లాసుల పద్దతి...

ABN , First Publish Date - 2020-06-05T17:53:29+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్ జగనన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలిపై వివాదం ముదురుతోంది. నిజాయితీపరురాలిగా పేరున్న ఐఏఎస్ అధికారి రమామణి ఆకస్మిక మరణంపై చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతున్న పరిస్థితే ఇందుకు కారణం.

ప్రభుత్వంలో... రెండుగ్లాసుల పద్దతి...
rama mani

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగనన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలిపై వివాదం ముదురుతోంది. నిజాయితీపరురాలిగా పేరున్న ఐఏఎస్ అధికారి రమామణి ఆకస్మిక మరణంపై చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతున్న పరిస్థితే ఇందుకు కారణం.


ఆ ఇద్దరూ... ఈ మొత్తం వ్యవహారానికి ప్రవీణ్ ప్రకాష్,  పీయూష్ కుమార్  కారణమనే ఆరోపణలు తారస్థాయిలో వినిపిస్తున్నాయి. టీకే రమామణి వాణిజ్యపన్నుల శాఖ కార్యదర్శిగా పని చేశారు. అవినీతి అధికారులు ఉంటే ఆ పోస్టులో కోట్లు సంపాదించుకోవడానికి వీలుంటుందనే అభిప్రాయాలున్నాయి. 


ఆమె కమర్షియల్ ట్యాక్స్ శాఖలో పని చేస్తున్న సమయంలో నెలకు రూ. లక్ష చొప్పు సీఎం పేషీ ఖర్చులకు పంపాలని, తనకు ఒక కారు కావాలని ఆమెను ప్రవీణ్ ప్రకాష్ డిమాండ్ చేశారని సమాచారం. డివోపీటీకి పంపిపిన ఫిర్యాదులో ప్రవీణ్‌ప్రకాష్‌పై మరికొందరు అధికారులు ఇవే ఆరోపణలు చేశారు. 


కాగా... తిరుమల తిరుపతి దేవస్థానంలో పోస్టింగ్ రాబోతున్నట్లు ఆమె ఆనందంగా ఉన్న సమయంలో ప్రవీణ్ ప్రకాష్ అడ్డుపడ్డారని రమామణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉత్తర్వులు జారీ చేయకుండా రమామణిని వేధించారని ఐఏఎస్ వర్గాల్లోనే గుప్పుమంది. ముఖ్యమంత్రి క్లియర్ చేసిన తన పోస్టింగ్ గురించి అడిగితే ప్రవీణ్ ప్రకాష్ లేనిపోని విషయాలను ప్రస్తావించి రమామణిని మానసిక వేదనకు గురి చేశారని ఆమె కుటుంబ సభ్యులు విమర్శిస్తున్నారు. 


ఆమె సోదరుడి ఆవేదన... ‘ఒక కాకి చచ్చిపోతే బోలెడు కాకులు వస్తాయి. ఓ ఐఏఎస్ అధికారికి అన్యాయం జరిగితే ఎవరూ ఎందుకు మాట్లాడరు ? వీళ్ల సంఘాలు ఏం చేస్తున్నట్టు ? అసలు ఆ సంఘాలు దేనికి ? మౌనంగా ఉన్నవాళ్లూ వేధింపులకు గురైతే... అప్పుడు బోధపడుతుంది’ అని రమామణి సోదరుడు వ్యాఖ్యానించారు. 


Updated Date - 2020-06-05T17:53:29+05:30 IST