వరుసగా రెండే వాహనాలు

ABN , First Publish Date - 2020-11-23T07:27:01+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రచార నిబంధనలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అభ్యర్థుల

వరుసగా రెండే వాహనాలు

అంతకుమించితే వంద మీటర్ల దూరం

జీహెచ్‌ఎంసీ ప్రచారంపై ఈసీ ఆదేశాలు

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రచార నిబంధనలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అభ్యర్థుల ప్రచారంలో రెండుకు మించి వాహనాలు వరుసగా వెళ్లరాదని సూచించింది. అంతకన్నా ఎక్కువ వాహనాలను వినియోగిస్తే.. ప్రతి రెండు వాహనాలకు మధ్య 100 మీటర్ల దూరం పాటించాలని పేర్కొంది. అనధికారికంగా వినియోగించే వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు అభ్యర్థి భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కింద శిక్షార్హులని పేర్కొంది. ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలోఉంచుకుని.. సంబంధిత అధికారులు వాహ నాలకు అనుమతి పత్రాలు జారీ చేస్తారని తెలిపింది. 


ఎన్నికల ప్రచార నిబంధనల్లో ప్రధానాంశాలు

 ప్రచార వాహనాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. స్టార్‌ క్యాంపెయినర్‌ పేరు, వాహనం, రిజిస్ర్టేషన్‌ నంబరు నమోదు చేయించి, పర్యటించే ప్రాంతాలకు ముందస్తుగానే అనుమతి పొందాలి. 

 ప్రచారంలో ప్రభుత్వ వాహనాలు వాడొద్దు.

 లౌడ్‌ స్పీకర్లు, మైకులు, రోడ్‌ షోలు, ప్రజా సమావేశాలను ఉదయం 6 గంటల తర్వాత ప్రారంభించి రాత్రి 10 గంటలలోగా ముగించాలి. వీటికి ముందస్తు అనుమతి తీసుకోవాలి.


Updated Date - 2020-11-23T07:27:01+05:30 IST