ముస్లిమేతర జంటకు వివాహ ధృవీకరణ పత్రం! యూఏఈలో తొలిసారిగా..

ABN , First Publish Date - 2021-12-29T02:58:09+05:30 IST

సంస్కరణల దిశగా ముందుకు సాగిపోతున్న యూఏఈలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. దుబాయ్‌లో సివిల్ చట్టాలని అనుసరించి వివాహం చేసుకున్న ఓ కెనడా జంటకు అక్కడి ప్రభుత్వం వివాహ గుర్తింపు పత్రాన్ని జారీ చేసింది. ఇప్పటివరకూ యూఏఈలో జరిగే పెళ్లిళ్లన్నీ మతమరమైన సంస్థల ఆధ్వర్యంలో జరిగేవి. కానీ..

ముస్లిమేతర జంటకు వివాహ ధృవీకరణ పత్రం! యూఏఈలో తొలిసారిగా..

ఇంటర్నెట్ డెస్క్: సంస్కరణల దిశగా ముందుకు సాగిపోతున్న యూఏఈలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. దుబాయ్‌లో సివిల్ చట్టాలని అనుసరించి వివాహం చేసుకున్న ఓ కెనడా జంటకు అక్కడి ప్రభుత్వం వివాహ గుర్తింపు పత్రాన్ని జారీ చేసింది. ఇప్పటివరకూ యూఏఈలో జరిగే పెళ్లిళ్లన్నీ  మతమరమైన సంస్థల ఆధ్వర్యంలో జరిగేవి. కానీ.. ప్రభుత్వం తొలిసారిగా ఓ సివిల్ వివాహాన్ని కూడా గుర్తించింది. యూఏఈ జనాభాలో అధిక శాతం విదేశీయులే. ఈ నేపథ్యంలో ఆధునిక సమాజంగా రూపుదిద్దుకునే పనిలో తలమునకలుగా ఉన్న యూఏఈ ఇప్పటికే పలు సంస్కరణలకు తెర తీసింది. 

Updated Date - 2021-12-29T02:58:09+05:30 IST