భారత విమానాలపై యూఏఈ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2021-08-03T05:30:00+05:30 IST

డెల్టా వేరియంట్ భయంతో భారత్ సహా పలుదేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన యూఏఈ

భారత విమానాలపై యూఏఈ కీలక ప్రకటన

అబుధాబి: డెల్టా వేరియంట్ భయంతో భారత్ సహా పలుదేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన యూఏఈ.. ఈ విషయంలో కీలక ప్రకటన చేసింది. భారత్, పాకిస్తాన్, నైజీరియా తదితర దేశాల నుంచి వచ్చే ట్రాన్సిట్ విమానాలపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. ఈ నిషేధాన్ని ఆగస్టు 5 నుంచి తొలగించనున్నట్లు తెలిపింది. అంటే ఈ దేశాల నుంచి నేరుగా విమానాలు లేని దేశాలకు వెళ్లే సమయంలో సదరు ప్రయాణికులు.. యూఏఈలో వేరే విమానం ఎక్కడానికి కుదురుతుంది. ఇన్ని రోజులూ భారత్ సహా పలు దేశాల నుంచి వచ్చే విమానాలను పూర్తిగా బ్యాన్ చేసిన యూఏఈ.. ఈ నిర్ణయంతో సదరు దేశాల నుంచి వచ్చే విమానాలను పాక్షికంగా అనుమతించినట్లు అవుతుంది. ఇలా తమ దేశం బ్యాన్ విధించిన దేశాలకు చెందిన ప్రయాణికులకు.. గురువారం నుంచి తమ విమానాశ్రయాల్లో ట్రాన్సిట్‌కు అనుమతులు ఉంటాయని నేషనల్ ఎమర్జెన్సీ అండ్ క్రైసీస్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌సీఈఎమ్ఏ) పేర్కొంది.

Updated Date - 2021-08-03T05:30:00+05:30 IST