ఫిబ్రవరి మధ్యనాటికి 1.5కోట్ల మందికి వ్యాక్సిన్: బోరిస్ జాన్సన్

ABN , First Publish Date - 2021-01-14T15:43:01+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తోంది. యూకేలోనూ ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో

ఫిబ్రవరి మధ్యనాటికి 1.5కోట్ల మందికి వ్యాక్సిన్: బోరిస్ జాన్సన్

లండన్: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తోంది. యూకేలోనూ ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్.. స్థానికంగా మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరపనున్నట్టు చెప్పారు.  వారంలోని ఏడు రోజుల్లో 24 గంటలపాటు ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సప్లై ఆధారంగా వ్యాక్సినేషన్ చేస్తున్నట్టు వివరించారు. ఫిబ్రవరి మధ్యనాటికి 1.5కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 26.39లక్షల మందికి టీకా ఇచ్చినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే.. గడిచిన 24గంటల్లో 47వేల మంది కొవిడ్ బారినపడగా.. ఇదే సమయంలో 1500 మందిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు యూకేలో నమోదైన కేసుల సంఖ్య 32.11లక్షలకు చేరగా.. దాదాపు 85 మంది మహమ్మారికి బలయ్యారు. 


Updated Date - 2021-01-14T15:43:01+05:30 IST