ప్రధానికి వింత అనుభవం.. చూసి నవ్వుతున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2021-07-30T06:45:22+05:30 IST

యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురైన అనుభవాన్ని చూసి నెటిజన్లంతా నవ్వుకుంటున్నారు. బుధవారం నాడు

ప్రధానికి వింత అనుభవం.. చూసి నవ్వుతున్న నెటిజన్లు

లండన్: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురైన అనుభవాన్ని చూసి నెటిజన్లంతా నవ్వుకుంటున్నారు. బుధవారం నాడు ఒక అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక గొడుగు పట్టుకొని ఉన్నారు. ఆ సమయంలో బలమైన గాలి వీయడంతో బోరిస్ చేతిలోని గొడుగు వెనక్కు తెరుచుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వాళ్లంతా నవ్వుకుంటున్నారు. విధుల్లో మరణించిన పోలీసు అధికారుల జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నాన్ని ఇంగ్లండ్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ విలియం తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే బోరిస్ జాన్సన్ చేతిలోని గొడుగుకు ఇలా అవడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Updated Date - 2021-07-30T06:45:22+05:30 IST