మహిళా శక్తికి ప్రతిరూపం ‘ఇభా’

ABN , First Publish Date - 2021-10-12T06:46:46+05:30 IST

భారత్‌లో వచ్చే ఏడాది జరిగే అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ మస్కట్‌ ‘ఇభా’ను సోమవారం ఫిఫా ఆవిష్కరించింది.

మహిళా శక్తికి ప్రతిరూపం ‘ఇభా’

అండర్‌-17 వరల్డ్‌కప్‌ మస్కట్‌ ఆవిష్కరణ

న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే ఏడాది జరిగే అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ మస్కట్‌ ‘ఇభా’ను సోమవారం ఫిఫా ఆవిష్కరించింది. మహిళా శక్తిని ప్రతిబంబించే విధంగా.. ఆసియా సివంగి రూపంలో మస్కట్‌ను రూపొందించారు. భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్త మహిళలు, బాలికల శక్తిసామర్థ్యాలను తెలియజేయడమే ‘ఇభా’ ముఖ్యోద్దేశమని నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబరు 11 నుంచి 30 వరకు ఈ యువ వరల్డ్‌కప్‌ జరగనుంది.

Updated Date - 2021-10-12T06:46:46+05:30 IST