రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు

ABN , First Publish Date - 2022-04-08T09:07:34+05:30 IST

అమరావతి ప్రాంతంలో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అమరావతి జేఏసీ నేతల వద్ద కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నిస్సహాయత

రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు

ఎన్‌హెచ్‌ఏఐకి కోర్టు ద్వారా ఆదేశాలిప్పించండి

అమరావతి జేఏసీ నేతలకు కేంద్ర మంత్రి గడ్కరీ సూచన


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రాంతంలో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అమరావతి జేఏసీ నేతల వద్ద కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నిస్సహాయత వ్యక్తంచేశారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ నేతృత్వంలో గురువారం అమరావతి జేఏసీ నేతలు ఆయన్ను కలిశారు. బెంగళూరు-అమరావతి వయా అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేను జగన్‌ ప్రభుత్వం చిలకలూరిపేట వరకు మాత్రమే పరిమితం చేసిందని, దాన్ని అమరావతి వరకు పొడిగించాలని కోరారు. అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు చేట్టాలని అభ్యర్థించారు. దానికి గడ్కరీ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. వారి సహకారం లేకుండా మేం ఎలా చేయగలం’’ అని ప్రశ్నించారు. రహదారులు అభివృద్ధి చేయాలంటూ జాతీయ రహదారుల సంస్థకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టులో అప్పీలు చేయండని సూచించారు.

Updated Date - 2022-04-08T09:07:34+05:30 IST