కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ
ABN , First Publish Date - 2021-01-18T08:57:29+05:30 IST
జాతీయ పతాక రూపశిల్పి, పింగళి పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని 1921 ఏప్రిల్ 1న విజయవాడలోని జింఖానా మైదానంలో జాతీయ పతాకంగా గాంధీజీ ప్రకటించారని కాంగ్రెస్ సీనియర్ నేత
వందేళ్ల ఉత్సవాలు జరపాలి.. సోనియాకు వీహెచ్ లేఖ
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జాతీయ పతాక రూపశిల్పి, పింగళి పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని 1921 ఏప్రిల్ 1న విజయవాడలోని జింఖానా మైదానంలో జాతీయ పతాకంగా గాంధీజీ ప్రకటించారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు అన్నారు. జాతీయ పతాకాన్ని ప్రకటించి వందేళ్లవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ వందేళ్ల ఉత్సవాలను నిర్వహించాలని కోరుతూ సోనియా గాంధీకి ఆదివారం ఆయన లేఖ రాశారు. పింగళి వెంకయ్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, ఇది తగదని పేర్కొన్నారు.