గేదె కోసం నాలుగు రౌండ్ల కాల్పులు... గ్రామంలో పోలీసు పహారా!

ABN , First Publish Date - 2021-03-29T17:06:17+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్ జిల్లాలో...

గేదె కోసం నాలుగు రౌండ్ల కాల్పులు... గ్రామంలో పోలీసు పహారా!

ఆజమ్‌గఢ్: ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్ జిల్లాలో ఒక గెదె కోసం రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగింది. ఈ నేపధ్యంలో ఒక వర్గంవారు మరొక వర్గంవారి ఇంటిలోనికి చొరబడి, గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక యువకుడు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 


మరోవైపు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు తుపాకీ కాల్పులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ధౌరాహర గ్రామానికి చెందిన ఫహీమ్ కుమారుడు యూసుఫ్ నెల్లాళ్ల  క్రితం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నుంచి గేదెను కొనుగోలు చేశాడు. అయితే దీనిపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపధ్యంలో ఫహీమ్ ఇంటికి మరోవర్గానికి చెందినవారు వచ్చి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 ఏళ్ల ఫహద్ ఖాన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-29T17:06:17+05:30 IST