వైద్య సిబ్బంది కొరత.. సైన్యాన్ని రంగంలోకి దింపుతున్న అమెరికా!

ABN , First Publish Date - 2022-01-15T02:55:55+05:30 IST

అమెరికాలో వైద్య సిబ్బంది కొరతను అధికమించేందుకు ప్రభుత్వం సైన్యంపైనే అధికంగా ఆధారపడుతోంది.

వైద్య సిబ్బంది కొరత.. సైన్యాన్ని రంగంలోకి దింపుతున్న అమెరికా!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో వైద్య సిబ్బంది కొరతను అధికమించేందుకు ప్రభుత్వం సైన్యంపైనే అధికంగా ఆధారపడుతోంది. ఈ క్రమంలోనే మిలిటరీకి చెందిన వెయ్యి మంది వైద్య సిబ్బందిని రంగంలోకి దింపింది. సిబ్బంది కొరతతో సతమతమవుతున్న వివిధ  ఆస్పత్రులకు వీరిని కేటాయించింది. మిషిగన్, న్యూజెర్సీ, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఒహాయో, రోడ్ ఐల్యాండ్, రాష్టాల్లో వీరు సేవలందించనున్నారు. 


ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఆస్పత్రి పాలవుతున్న వారిలో దాదాపు 65 శాతం మంది టీకా తీసుకోలేదు. అంతేకాకుండా.. వీరిలో దాదాపు 90 శాతం మందికి బూస్టర్ డోసు అందలేదు. అక్కడి జనాభాలో 62 శాతం మంది పూర్తి స్థాయిలో కరోనా టీకా తీసుకున్నారు. అయితే..కంపెనీలు తమ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకుందామనుకున్న  అధ్యక్షుడు బైడెన్ ప్రయత్నాలకు బ్రేక  పడింది. టీకా తప్పనిసరి చేయాలనడం సరికాదని అక్కడి న్యాయస్థానం అభిప్రాయపడటంతో అమెరికా ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. 

Updated Date - 2022-01-15T02:55:55+05:30 IST