Advertisement
Advertisement
Abn logo
Advertisement

వామ్మో.. 18 సెకన్లలో రెండు లీటర్ల కూల్‌డ్రింక్ తాగేశాడు!

వాషింగ్టన్: ఒక లీటర్ నీటిని ఆగకుండా క్షణాల్లో తాగాలంటేనే ఆలోచిస్తాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా రెండు లీటర్ల కూల్‌డ్రింకును సెకనల్ల వ్యవధిలో తాగేసీ అందరినీ ఆశ్చర్యపర్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఎరిక్ బాడ్‌లాండ్స్ బూకర్ అనే యూట్యూబర్.. తరచూ ఈటింగ్, ర్యాపర్ పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాలనేది ఎరిక్ బాడ్‌లాండ్స్ బూకర్ కల. ఈ క్రమంలో మే 19న న్యూయార్క్‌లోని సెల్డన్‌లో జరిగిన పోటీల్లో ఆయన పాల్గొన్నారు. కేవలం 18.45సెకన్లలో గుక్కతిప్పుకోకుండా 2లీటర్ల కూల్‌డ్రింక్‌ను తాగి, అందరినీ ఆశ్చర్యపర్చారు. దీంతో కూల్‌డ్రింక్‌ను అత్యంత వేగంగా తాగిన వ్యక్తిగా ఎరిక్ బాడ్‌లాండ్స్ బూకర్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు పొందారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement