భారత్‌కు 25 మిలియన్ డాలర్ల కరోనా సాయం: అమెరికా

ABN , First Publish Date - 2021-07-30T07:22:12+05:30 IST

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు సాయం చేస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఈ క్రమంలో అమెరికా

భారత్‌కు 25 మిలియన్ డాలర్ల కరోనా సాయం: అమెరికా

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు సాయం చేస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఈ క్రమంలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటనీ బ్లింకెన్ ఒక ప్రకటన చేశారు. భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు అమెరికా మద్దతిస్తుందని చెప్పిన ఆయన.. దీనికోసం అమెరికా తరఫున 25 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించారు. వ్యాక్సిన్ సరఫరాలో ఈ సొమ్ము ఉపయోగపడుతుందని, తద్వారా మరిన్ని వ్యాక్సిన్లను భారత్ సమకూర్చుకోగలుగుతుందని బ్లింకెన్ ఆశించారు. ఇప్పటికే అమెరికా ఇలా కరోనా సహాయార్థం 200 మిలియన్ డాలర్లపైగా విరాళాలు ఇచ్చిందని బ్లింకెన్ చెప్పారు. అలాగే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తొలినాళ్లలో భారత్ తమకు చేసిన సాయాన్ని అమెరికా మర్చిపోదని పేర్కొన్నారు.

Updated Date - 2021-07-30T07:22:12+05:30 IST