కీలక బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం.. ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా!

ABN , First Publish Date - 2021-06-11T21:29:17+05:30 IST

యూఎస్ సెనేట్ కీలక బిల్లకు ఆమోదం తెలిపింది. దీంతో అమెరికాలో చరిత్రలోనే మొదటిసారిగా ముస్లిం అమెరికన్ ఫెడరల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్య

కీలక బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం.. ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా!

వాషింగ్టన్: యూఎస్ సెనేట్ కీలక బిల్లకు ఆమోదం తెలిపింది. దీంతో అమెరికాలో చరిత్రలోనే మొదటిసారిగా ముస్లిం అమెరికన్ ఫెడరల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ముస్లిం అమెరికన్ అయిన జాహిద్ ఖురేషిని న్యూ‌జెర్సీ డిస్ట్రిక్ట్ కోర్టు ఫెడరల్ జడ్జిగా కొద్ది రోజుల క్రితం నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఎస్ సెనేట్ బైడెన్ నిర్ణయానికి తాజాగా మద్ధతు తెలిపింది. జాహిద్ ఖురేషి నియామకానికి సంబంధించిన బిల్లకు ఆమోదం తెలిపింది. జాహిద్ ఖురేషి నియామకానికి సంబంధించిన బిల్లుపై సెనేట్‌లో ఓటింగ్ జరగ్గా.. 81 మంది బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో ఫెడరల్ జడ్జిగా జాహిద్ ఖురేషి నియమానికి సెనేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన వారిలో 34 మంది రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా చరిత్రలోనే ఫెడరల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించబోతున్న మొట్టమొదటి ముస్లిం అమెరికన్‌గా జాహిద్ ఖురేషి గుర్తింపు పొందారు. 


Updated Date - 2021-06-11T21:29:17+05:30 IST